"బర్త్ కంట్రోల్" లేదా కుటుంబ నియంత్రణ యువజంటలు కోరుకునే సలహాలలో 
ఒకటి.చాలా మంది పెళ్ళయిన లేదా యుక్తవయసులోని యువతీ యువకుల జంటలు అవాంఛిత 
గర్భధారణ లేదా లైంగిక చర్యల ద్వారా సంక్రమించే సుఖవ్యాధుల నివారణ కొరకు ఈ 
నియంత్రణ కి ప్రాముఖ్యత ఇస్తారు.
అవాంఛిత గర్భం రాకుండా వాడే కుటుంబ నియంత్రణా పద్ధతులు ఆడవారితో పాటు 
మగవారు పాటించేవి కూడా ఉన్నాయి.ఈ పద్దతులు పాటించి చాలా శాతం అవాంఛిత 
గర్భాన్ని నిరోధించవచ్చు.మన దేశం లో అపరిమితం గా జనాభా పెరిగిపోతుండటంతో 
కుటుంబ నియంత్రణ యువ జంటల ఆలోచనల్లో ప్రాముఖ్యత ని సంతరించుకుంది.
                కుటుంబ నియంత్రణా పద్ధతులని ఆడ మగా ఇద్దరూ పాటించి అవాంఛిత గర్భాన్ని 
నిరోధించవచ్చు. మగవారు ఆబ్ స్టినెన్స్ (లైంగిక చర్యలకి దూరం గా 
ఉండటం),కండోం,ఔటర్ కోర్స్ సెక్స్(స్త్రీ జననాంగాల లోనికి మగవారి అంగాన్ని 
చొప్పించకుండా చేసుకునే లైంగిక చర్య),వాసెక్టమీ(ఆప్రేషన్) లేదా విత్ డ్రాల్
 టెక్నిక్(మగవారు స్ఖలనానికి కొద్ది సెకన్ల ముందు తమ అంగాన్ని యోనీ లోనుండి
 బయటకి తీసెయ్యడం) లాంటి పాద్ధతులని పాటించి ఆడవారిలో గర్భాన్ని 
నిరోధించవచ్చు.పైన చెప్పిన పద్దతులలో ఒక్కొక్క పద్ధతీ ఒక్కొక రీతిలో 
రీతులలో సమర్ధవంతగా పనిచేస్తాయి. కానీ ఏ ఒక్క గర్భ నిరోధక పద్ధతీ 100 % 
అవాంఛిత గర్భాన్ని నిరోధించలేదన్నది మాత్రం నిజం. మీరు పైన చెప్పిన ఏ 
పద్ధతయినా పాటించేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుని ఒకవేళ ఆ పద్ధతి గానీ 
సమర్ధవంతం కాకపోతే అని ఆలోచించి దానికి కూడా సంసిద్ధులై ఉండాలి.
             మగవారికి ఉన్న గర్భ నిరోధక పద్ధతులు ఒక్కోటీ కొన్ని మార్గదర్శకాలు, ఆ 
ఉత్పత్తి వాడే విధానం లాంటి సూచనలతో ఉంటాయి. వీటిని నిపుణుల సలహా తీసుకుని 
వాడితే సమర్ధవంతం గా పనిచేసే వీలుంది.కండోముల లాంటివి కూడా లైంగిక చర్యా 
సమయం లో తయారీ లోపం లేదా ఇతర కారణాల వల్ల చిరిగిపోవడానికి 3% అవకాశం ఉంది. 
అందువల్ల ఇలాంటి హెచ్చరికలని ప్యాకింగ్ మీద ముద్రించడం వల్ల , మగవారు 
వీటిని వాడేటప్పుడు ఒకవేళ చిరిగిపోతే ఎదురయ్యే సమస్యలకి సంసిద్ధులవుతారు.
కింద ఇచ్చినవి మగవారు పాటించ గలిగే గర్భ నిరోధక సాధనాలు
Best Contraceptives For Men: Pregnancy tips in Telugu.
1)ఆబ్స్ టినెన్స్: ఇది 100% సమర్ధవంతమైన గర్భ నిరోధక పద్ధతి. ఆబ్ స్టినెన్స్ ని ఆచరించమనడం తేలికే కానీ ఆచరించడమేమీ అంత తేలిక కాదు . గర్భ నిరోధకం గా ఇది పాటించాలనుకునే జంటలో ఇద్దరికీ విల్ పవర్ చాలా కావాలి.జంటలు సన్నిహితం గా లైంగిక చర్యలో పాల్గొంటే అది వారి బంధాన్ని ధ్రుడపరుస్తుంది.కానీ దాని నుండి దూరం గా ఉండాలి అంటే చాలా కష్టం.మార్కెట్లో దొరికే సెక్స్ టాయ్స్ వాడి ప్రత్యక్ష సంభోగాన్ని నివారించవచ్చు. అవి వద్దనుకుంటే జంటలు పరస్పరం హస్తప్రయోగం చేసుకోవచ్చు.
                 2)కండోం:
అతి తేలిక గా లభించి, వాడగలిగే గర్భ నిరోధక సాధనం కండోం.దీనిని జాగ్రత్తా 
వాడితే గర్భాన్ని నిరోధించగలిగే అవకాశాలెక్కువ.లైంగికానందం లోని దాదాపు 
అన్ని సుఖాలని కండోం ధరించి సంగమించడం ద్వారా పొందవచ్చు. అందువల్లే ఇది ఒక 
ప్రముఖ గర్భ నిరోధక సాధనమయ్యింది.దీనిని వాడకం చాలా తేలిక. ఈ కారణం చేత 
కండోం అన్ని వేళలా ఒక అనుకూలమైన ఎంపిక.
                 3)ఔటర్ కోర్స్:
మగవారు ఈ పద్ధతిని పాటించి తమ భాగస్వామి గర్భాన్ని నిరోధించవచ్చు.ఈ 
పద్ధతిలో ప్రత్యక్ష అంగ ప్రవేశం తప్ప లైంగిక చర్యలో ఉన్నట్లే అంతా 
ఉంటుంది.దీనివల్ల గర్భాన్ని 100% నివారించవచ్చు. కానీ పొరపాటున జరిగే అంగ 
ప్రవేశం లేదా ఆడవారి జననేంద్రియాల వద్ద స్ఖలించడం లాంటి పొరపాట్లకి 
తావివ్వకపోతే ఇది చాలా సమర్ధవంతమైన సాధనం.
ADVERTISEMENT
                 4)విత్ డ్రాల్ టెక్నిక్:
దీనినే "పుల్ అవుట్" పద్ధతి అని కూడా అంటారు. ఈ పద్ధతి విఫలమయ్యే అవకాశం 4%
 మాత్రమే.ఈ పద్ధతిలో మగవారు స్ఖలనం జరగడానికి కొద్ది సేపటి ముందు తమ 
అంగాన్ని బయటకి తీసెయ్యాలి.అందువల్ల వీర్యం, అండంతో కలిసి పిండ రూపం 
దాల్చదు. కానీ ఈ పద్ధతికి చాలా రిస్క్ తో కూడుకున్నది.
           5)వాసెక్టమీ:
వాసెక్టమీ అంటే ఒక శస్త్ర చికిత్సా విధానం. ఈ శస్త్ర చికిత్సలో, వీర్యం 
ప్రయాణించే వాహిక ని కట్ చేసి,ఈ మార్గాన్ని మూసెస్తారు.ఒకసారి ఈ శస్త్ర 
చికిత్స అయ్యాకా కావాలనుకుంటే మరలా దీనిని తెరవవచ్చు. కానీ అన్ని సార్లూ 
ఇది సాధ్యం కాకపోవచ్చు.వాసెక్టమీ ఆపరేషన్ ,శాశ్వత గర్భ నిరోధక సాధనం.మగవారు
 తమకిక పిల్లలు ఖచ్చితం గా వద్దనుకుంటే కనుక ఈ ఆపరేషన్ చేస్తారు.
                   6)సేఫ్ పీరియడ్: ఆడవారు తమ బహిష్టు సమయాన్ని లెక్క కడుతూ,అండం విడుదలయ్యే 
రోజులలో తప్ప ఇతర సమయాల్లో లైంగిక చర్యలలో పాల్గొనడం వల్ల అవాంఛిత గర్భం 
వచ్చే అవకాశం తక్కువ. కావాలనుకుంటే అండం విడుదలయ్యే రోజులలో కూడా కండోం, 
లేదా ఇతర గర్భ నిరోధక పద్ధతులు పాటిస్తూ లైంగిక చర్యలో పాల్గొనవచ్చు. 
