Showing posts with label ఆధ్యాత్మికం. Show all posts
Showing posts with label ఆధ్యాత్మికం. Show all posts

Friday, 2 September 2016

దర్మేచ ,అర్దేచ ,కామేచ ,మోక్షేచ నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

హిందువులు అయిన పురుషులు వివాహ సమయాలలో తప్పకుండా చెప్పవలసిన మాటలు దర్మేచ ,అర్దేచ ,కామేచ ,మోక్షేచ నాతి చరామి అని .దాని అర్దం జీవితం లో ప్రతి విషయంలోను తను చేపట్టబోయే స్త్రీ తోనే కలసి నడుస్తాను అని. అయితే అన్ని మంత్రాలు మాదిరే అది కూడ ఒక మంత్రం అనుకుని ప్రతి వరుడు మొక్కుబడిగా ఆ నాలుగు మాటలు అనేసి, తంతు ని మమ అనిపిచేస్తుంటారు. కానీ నిజ జీవితంలో ఆ నాలుగు మాటలకు కట్టుబడి కాపురం చేయ గలిగిన వాడే నిజమైన హిందువు. అప్పుడే హిందూ వివాహా వ్యవస్తకి ఒక అర్దం ,పరమార్దం . అలా చేసి చూపాడు ఒక సామాన్యుడు.
అనంత పురం జిల్లాలో కదిరి పరిసర ప్రాంతానికి చెందిన వ్యక్తి అతను. అందరకు మాదిరే వివాహమ్ చేసుకున్నాడు. కొంత కాలం వారి కాపురం సజావుగా సాగిందనడానికి ఆనవాలుగా వారికి పిల్లలు కలిగారు. ఆ తర్వాత బార్యకి భర్త అంటే మొహం మొత్తింది కాబోలు, గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళి పోయింది. పాపం ఆ భర్త పెద్ద మనుషుల ద్వారా అన్ని ప్రయత్నాలు చేస్సాడు. అవ్వన్నీ విపలమయ్యాయి. చివరకు చేసేదేమి లేక, మరో మనువు ఊసెత్తకుండా, తన పిల్లలకు తల్లి, తండ్రి అన్నీ తానే అయి పెంచి పెద్ద చేసి విద్యా బుద్దులు చెప్పించాడు.అలా ఇరవై మూడేళ్లు గడిచాయి.
మొన్నీ మద్య ఆయనకి బార్య పుట్టింటి తరపు నుంచి కబురు వచ్చింది. ఆయన గారి బార్య చనిపోయిందని, చివరి చూపు చూడాలనుకుంటె రమ్మని పిలిచారట. ఆయన ఒక హిందూ భర్తగా తన ధర్మం ప్రకారం అత్తవారింటికి వెళ్ళి, తన భార్యను తన ఊరిలోనే దహన సంస్కారాలు నిర్వహించి, తన చేతితోనే కర్మ కాండ జర్పుతాను అని చెప్పేసరికి అత్తవారింటి వారు అవాక్కయారట!ఎప్పుడొ ఇరవై మూడేళ్ళ క్రితం కట్టుకున్న మొగుడిని, కన్న బిడ్డలను వదలి వచ్చేసిన ఆ భార్య కాలేని భార్య చనిపోతే ఆమె మీద ప్రేమతో కూడిన బాద్యతను నెరవేర్చడానికి తయారైన ఆ భర్తలోని ధర్మ పరాయణత్వం చూసి అబ్బుర పడ్డారు ఇరు గ్రామాల ప్రజలు. అందరి అంగీకారంతో ఆమెకు కర్మ కాండ పూర్తి చేసాడు ఆ భర్త.
తాళి కట్టిన దానితో కాపురం చేస్తూ, చిన్న ఇళ్ళ ఏర్పాటు కోసం వెంపర్లాడే మగ మహా రాజులు ఉన్న ప్రస్తుత సమాజంలో, పెండ్లి నాటి ప్రమాణానికి కట్టుబడి, ఒకే మాట,ఒకే భార్య అనే శ్రీ రాముని ధర్మాచరణాన్ని ఆచరించి చూపిన అతను నిజంగా ధన్యజీవి. చీటికి మాటికి కొట్లాడుకుంటూ, చిన్న చిన్న సమస్యలనే పెద్ద,పెద్ద బూతద్దాలలో చూస్తూ, విడాకులు తీసుకునే ఆలుమగలు ఒక మాట గుర్తుంచుకోవాలి మొట్ట మొదటగా ఎవరి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి వివాహా మాడుతున్నారో వారితోనే జీవన సాపల్యం పొందడం గొప్ప అద్రుష్టం. వారి పిల్లలలొ ఉండె భద్రతాబావం, విడాకులు పొంది విడిగా ఉండే వారి పిల్లలో ఉండదు.

ఎవరికిష్టమైన జీవితం వారనుభవించే హక్కు భారత రాజ్యాంగం ప్రసాదించి ఉండవచ్చు .కానీ భార్యా భర్తలకు ఉండే స్వేచ్చాజీవిత హక్కుల కన్నా పిల్లల సహజ హక్కులైన తల్లితండ్రులతో కలసి ఉండడం అనేది ముఖ్యమైనది. కాబట్టి సాద్యమైనంతవరకు సర్దుకు పోయే గుణంతో సంసారాలను సాగించి పిల్లల సహజ హక్కును పరిరక్షించడం ప్రతి తల్లి ,తండ్రి కనీస ధర్మం . కాదని విడిపోయే వారి పిల్లలు అంత దురద్రుష్ట వంతులు ఈ లోకం లో ఎవరూ ఉండరు.పిల్లల మీద నిజంగా ప్రేమ ఉన్న వారైతే, ఆ పిల్లల తల్లి, లేక తండ్రి చేసే తప్పులను కూడా క్షమించే అంత సహనం కలిగి ఉంటారు. పై ఉదంతంలోని విషయమే తీసుకోండి. ఆ భర్త కి భార్యని భార్యగా చూడాల్సిన అవసరం లేనప్పటికి తన పిల్లలకు జన్మ నిచ్చిన తల్లిగా ఆమెను గౌరవించాడు. అ గుణమే ఆయనకు,అయన పిల్లలకు శ్రీ రామ రక్ష.

"విగ్రహం" లో ఏముందో "విశ్వం" లోనూ అదే ఉందని తెలుసుకోలేని వారు జ్ఞానులా ?

ఈ మద్య కొందరు పని కట్టుకుని హిందూ జీవన విదానం లోని "విగ్రహారాదన" మీద విగ్రహారాదకుల తమ ఆగ్రహం వెళ్ళగ్రక్కుతున్నారు. ప్రపంచంలోని ఎడారిలో పుట్టిన ఎడారి మతాలూ , వారి ఆరాధన పద్దతులు మీద మక్కువ కలిగిన కొందరు , పచ్చని బారత భూమిలో ఉద్బవించిన మతాలు--శైవం, వైష్ణవం , శాక్తేయం, సాయిబాబీయమ్,శాక్తేయం-- కు సంబందించిన ఆరాధన పద్దతులను తప్పు పడుతూ , విగ్రహారాదన అనేది జ్ఞానులు బగవంతుని గురించి తెలుసుకోవడానికి ఏ మాత్రం ఉపయోగ పడదని, భగవంతుని గురించి తెలుసుకోవాలంటే జ్ఞానమార్గమైన "ఉపాసన మార్గం "ఒక్కటే కరెక్టు అని నొక్కి నొక్కి వక్కాణిస్తున్నారు. దీనికి వారు బోల్డన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అవ్వన్నీ సహేతుకమైనవే అని అనిపిస్తుండడం వలన, కొంత మంది ఆ ప్రబోదకుల మాయలో పడి డోలాయమాన స్తితిలో ఉన్నారు. మరి వారు చెప్పేది అలా ఉంది. శ్రీకృష్ణ భగవానుడు విగ్రహారాదనకు వ్యతిరేకమని, అయన చెప్పబట్టే ఎడారి మతాల్లో విగ్రహారాదన లేకుండా పోయిందని , అందుకే అయన విశ్వ గురువు అయ్యాడు అని, విగ్రహరాదనను అయన సమర్దించి ఉంటె కేవలం "భరత గురువు " మాత్రమే అవుతాడని గడుసు వాదనలు చెయ్యటం మొదలు పెట్టారు .
అసలు ఈ ఎడారి మతస్తులకు శ్రీ కృష్ణ బగవానుడికి విశ్వ గురువు ముద్ర వేసి , అయన విగ్రఃఅరాదనను ఖండించారు అని ,దానినే తమ మతస్తులు పాలో అవుతున్నారని,అసలు వేదాల్లో చెప్పింది తమ ప్రవక్త గురించే అని తెగ ఊదరగొడుతూ , మోకాలికి బట్టతలకు ముడి వేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు ?. తాము అనుసరిస్తుంది వేద మతం లో చెప్పినదే కాబట్టి ఇండియాలోని హిందువులంతా తమ పద్ధతినే అనుసరించమని పదే పదే చెబుతుండడం వెనుకాల ఏదైనా మతలబ్ ఉందా అని ఆలోచిస్తే రోజు ఈనాడు పేపర్లో రాసిన ఒక విషయం నన్ను ఆకర్షించింది. సదరు విషయానికి , ఈ బ్లాగ్ ప్రవక్తల రీపిటడ్ ప్రచారాలకు సంబందం ఉన్నట్లే కనిపిస్తుంది.
పై సమాచరం ప్రకారం 2020 నాటికి భారత దేశం లో కూడా ఖలీఫా రాజ్య స్తాపనే ఎడారి మతస్తుల పరమోద్దేశ్యం . కేవలం 5 సంవత్సరాలలో కోట్లాది మంది ప్రజలను తమ మతానికి అనుగుణంగా మార్చాలి అంటె , భారత దేశం లోని మెజార్తీ మతస్తుల మనోబావాలను డైరెక్టుగా గాయపరచే చర్యలు మానుకోవాలి అని వారు బావించి ఉండవచ్చు. . హిందువుల దేవుళ్ళను మెచ్చుకూంటూ , వారి ఆరాధన పద్దతులను నిరసిస్తూ . ఇవ్వన్ని స్వార్ధపరులైన కొంతమంది హిందూ పండితుల కుట్ర అని ప్రచారం చేసి యువతను తమ ఆరాధనా పద్దతుల పట్ల ఆకర్షితులు అయ్యేలా చేస్తే, ఆ తర్వాత వారిని పూర్తిగా తమ ప్రబావానికి గురి చేయవచ్చు. హిందూ మతాలకు . ఎడారి మతానికి ముఖ్య బేదం విగ్రహరాదన . ఎడారి మతస్తులు దేనినైనా ఒప్పుకుంటారు కాని , విగ్రహారాదన ఒప్పుకోరు. విగ్రహారాదన ఉన్నంత కాలం హిందు దేశం లో తమ పప్పులు ఉడకవు. కాబట్టే విగ్రఃహారాదనను అజ్ఞాన పూజా పద్దతిగా ముద్ర వేసి ,యువతను దాని నుండి దూరం చేస్తే , తమ రాజ్య స్తాపన సులువు అవుతుంది. ఇదే ఉద్దేశ్యం తో కొన్ని సంస్తలు చెసే ప్రచారం లో బాగమే "విగ్రహారాదన " పై విమర్శలు కావచ్చు. .
పై విషయం సంగతి కాసేపు అటు ఉంచి , అసలు మన దేశం లోని దైవ ఆరాధన పద్దతులు గురించి ఆలోచిద్దాం. హోందూ జీవన విదానం లో బగవంతుని దర్శించే మార్గాలులో భక్తీ మార్గం , జ్ఞాన మార్గం రేండూ ఉన్నాయి.భక్తీ మార్గం లో విగ్రహరాదన ఉంటె , జ్ఞాన మార్గం లో దాని అవసరం లేక పోవచ్చు. కాని భగవత్ దర్సనం అనేది వ్యక్తీ గతం గా ఎవరికీ వారే తెలుసుకోవాలి తప్పా , ఎవరో కొంత మంది దర్శనం పొందినంత మాత్రానా , తతిమ్మా వారు పొందాల్సిన అవసరం లేదని మన రుషులు చెప్పలేదు. ఒక వేల ఎడారి మతస్తులు చెపుతున్నట్లు అజ్ఞాన దశ లోనే "విగ్రాహారదన " అవసరం అనుకుంటే బగవంతున్ని నిజ దర్సనం పొందే జ్ఞానుల సంఖ్య ఎంత ? దాని గురించి సాక్షాత్తు శ్రీ కృష్ణుల వారే గీత లో సెలవు ఇచ్చారు . "వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానశక్తి ప్రయత్నించును, అట్లు ప్రయత్నించిన వారిలో ఒకా నొకడు మాత్రమే నన్ను యదార్దముగా తెలుసుకోగలుగుతున్నాడు" . మరి అయన చెప్పిన దాని ప్రకారమే దైవం అంటే ఏమిటో నిజంగా తెలుసుకునే జ్ఞానుల సంఖ్య బహు స్వల్పమ్. వారికి మాత్రమే విగ్రాహారదన అవసరం లేదు. మిగతా వారందరికి అవసరమే కదా!
విగ్రహారాదన చెయ్యకుండా , కేవలం మేమే జ్ణానులమని అపోహపడుతూ , రోజుకి 4,5 సార్లు వంగుని లేచినంత మాత్రానా వారికి నిజ దైవ దర్సనం కలుగుతుంది అనుకోవడం బ్రమే . విగ్రఃహారా దన అవసరమా ,వద్దా అనేది ఆరాదకుడు తన మానసిక స్తాయి ననుసరించి నిర్ణయించుకూంటాదు. దానికి వేరే మతస్తుల జ్యోక్యం అనవసరం. విగ్రాహరదనను వ్యతిరేకించడం అంటే హిందు మతాల ఆరాధనా పద్దతులను అవమాన పరచడమే .
హిందూ మతాల పద్దతులులో చాలా వరకు శాస్త్రీయ దోరణులు ఉన్న్నయి. అది సైన్స్ కి వ్యతిరేకం కాదు. శ్రీ కృష్ణుడి కాలం నాటికి , ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి . వాటికి అనుగుణంగా హిందూ జీవన విదానం లో మార్పులు సూచించడానికి మహాత్ములు పుడతారని , వారే అవతార పురుషులని ఈ గడ్డ మీద పుట్టిన మతాల నమ్మకం. వేరే మతాల లాగా ఒక్కరి తో పుట్టి వారి తోనే అంతం కాదు హిందూ జీవన విదానం. శ్రీ కృష్ణుడు కాలం నాటికి తెలుసుకున్న జ్ణానానుసారo అయన ప్రబోదిస్తే , ఈ నాటి జ్ణానా నుసారం "కల్కి అవతారుడు ప్రబోదించవచ్చు.దానికోసమే దశావతారాలు , 14 మంది మనువులు అని చెప్పింది. వారే సరి చేస్తారు, కాలంతరం వలన సమాజం లో కలిగే దోషాలను. అంతే కాని ఎడారిలో పుట్టిన మతాలుకు సంబందించిన వారు, , అసలు భారత దేశం గురించి తెలియని వారు ప్రబోదింస్తే వాటిని పాలో కావాల్సిన దుర్గతి హిందువులకు లేదు కాక లేదు.
చివరగా ఒక్క విషయం చెపుతాను . ప్రస్తుత యుగం సైంటిఫిక్ యుగం. సైంటిఫిక్ దియరి అనుసారం , విశ్వం మొత్తం అణువుల మయం అని , ప్రతి అణువు ఎలక్ట్రాన్ లు, ప్రోటాన్ లు , న్యూట్రాన్ లు నిర్మితమని , కాబట్టి చెట్టులో గట్టులో , పుట్టలో , ఇది రాస్తున్న నాలో, చదువుతున్న మీలో అందరిలో , విశ్వం అంతటా వ్యాపించి ఉంది అణువులే కదా . దాని ప్రకారం విగ్రహం వేరు, దేవుడు వేరు ఎలా అవుతారు ? విగ్రహం లో ఏముందో విశ్వం అంతటా అదే ఉంది. ఆ జ్ఞానం తెలుసుకుంటే శుష్క వాదనలు చేయడం ఎందుకు? "ఏ ఒక్కటి తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్లు అవుతుందో" అదే బ్రహ్మ జ్ణానమ్. మన అందరిలో ఉన్నది ఒకటే అని చాల మందికి తెలుసు. కాని వారు కూడా రాగద్వేషాలకు అతీతంగా ఉండలేక పోతున్నారు అంటే కారణం , మాయ!!
అవును మాయే ! బ్రహ్మ జ్ఞానం తెలిసినంత మాత్రానా బ్రహ్మ జ్ణానిగా ఉండలేరు. ఎందుకంటె ఆ జ్ఞానాన్ని నిరంతరం మాయ కప్పేస్తూ ఉంటుంది. దాని వలననే నీవు వేరు, దేవుడు వేరు అనే బావన. తనలో ఉన్న దేవుడిని కనుగొనడానికి ఎక్కడికో యాత్రలకు వెళ్లి అక్కడి రాళ్ళను రాళ్ళతో కొట్టడం , ఇక్కడి కొచ్చి విగ్రహారాదన వేస్ట్ అనడం. నిజమైన బ్రహ్మ జ్ఞాని గా మిగలాలి అంటె నిరంతరం ప్రకృతిని తన యందును , తనను ప్రకృతి యందును చూచుకుంటు , తన ప్రక్రుతి ధర్మం తానూ నెరవేర్చి చివరకు ప్రకృతిలో ఐక్యమై పోవడమే.
ఎవరి తోచిన పద్దతిలో వారు భగవంతున్ని ఆరాదించుకోడం లోనే నిజమైన అలౌకిక ఆనందం ఉంది . అటువంటి ఆనందానికి అరాదకులను దూరం చేసే పనికి రాని వాదనలు ప్రస్తుత తరుణం లో అనవసరం విగ్రహం లో ఏముందో "విశ్వం" లోనూ అదే ఉందని తెలుసుకున్న నాడు వాదనలకు ఆస్కారం ఉండదు.

భగవంతుడు వేలాది తలలు కలవాడు

భగవంతుడు వేలాది తలలు కలవాడు, వేలాది కన్నులు కలవాడు, వేలాది పాదాలు కలవాడు; భూమండలం యావత్తూ వ్యాపించి పది అంగుళాలు అధిగమించి నిలిచాడు.
మునుపు ఏది ఉన్నదో, ఇక ఏది రాబోతున్నదో సమస్తం భగవంతుడే. మరణం లేని ఉన్నత స్థితికి అధిపతి యైన వాడూ ఆయనే. ఎందుకంటే ఆయన ఈ జడ ప్రపంచాన్ని అతిక్రమించిన వాడు కనుక.
ఇక్కడ కానవస్తున్నదంతా భగవంతుని మహిమే. కానీ, ఆ భగవంతుడు వీటికంటే శ్రేష్ఠుడు. ఉద్భవమైనవన్నీ ఆయన పావు భాగమే. ఆయన ముప్పాతిక భాగం వినాశములేని గగనములో ఉంది.
భగవంతుని ముప్పాతిక భాగం పైన నెలకొని ఉంది. తక్కిన పావు భాగం ఈ ప్రపంచంగా ఆవిర్భవించింది. తరువాత ఆయన ప్రాణుల జడ పదార్థాలన్నిటిలో చొరబడి వ్యాపించాడు.
ఆ ఆది పురుషుని నుండి బ్రహ్మాండం ఉద్భవించింది. దానితో పాటు బ్రహ్మ ఆవిర్భవించి సర్వత్రా వ్యాపించాడు. తదనంతరం ఆయన భూమిని సృజించాడు. ఆ పిదప ప్రాణులకు శరీరాలను సృష్టించాడు.
భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకొని దేవతలు నిర్వర్తించిన యజ్ఞానికి వసంతకాలం నెయ్యిగాను, గ్రీష్మకాలం వంట చెరుకు గాను, శరత్కాలము నైవేద్యము గాను అయినవి.
ఈ యజ్ఞానికి పంచభూతాలు, రాత్రి, పగలు, కలిసి ఏడు పరిధులైనవి. ఇరవై ఒక్క తత్త్వాలు సమిధలయినాయి. దేవతలు యాగాన్ని ఆరంభించి బ్రహ్మను హోమ పశువుగా కట్టారు.
మొదట ఉద్భవించిన ఆ యజ్ఞ పురుషుడైన బ్రహ్మపై నీళ్ళు చలారు. పిదప దేవతలు, సాధ్యులు, ఋషులు, ఎవరవేరున్నారో ఆ యావన్మందీ యాగాన్ని కొనసాగించారు. (బ్రహ్మ పై నీళ్ళు చల్లి పవిత్రీకరించటం మొదలైన విధులతో యజ్ఞం ప్రారంభమవుతుంది).
ప్రపంచ యగ్నమైన ఆ యాగం నుండి పెరుగు కలిసిన నెయ్యి ఉద్భవించింది. పక్షులను, జింక, పులి వంటి వన్యమృగాలను, పశువు వంటి సాదు మృగాలను బ్రహ్మ సృష్టించాడు.
ప్రపంచ యగ్నమైన ఆ యాగంలో నుండి ఋగ్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, గాయత్రి మొదలగు ఛందస్సులు ఉద్భవించాయి. దాని నుండే యజుర్వేదము పుట్టినది.
అందులోనుండే గుర్రాలు, రెండు వరుసల దంతాలు గల మృగములు, పశువులు, గొర్రెలు, గేదెలు ఉద్భవించాయి.
బ్రహ్మను దేవతలు బలియిచ్చినప్పుడు ఆయనను ఏ ఏ రూపాలుగా చేశారు? ఆయన ముఖము ఏడిగా అయినది? ఆయన చేతులు ఎదిగా చెప్పబడినది? తోదలుగా, పాదాలుగా ఏవి చెప్పబడ్డాయి?
ఆయన ముఖము బ్రాహ్మణుడుగా అయినది. చేతులు క్షత్రియుడుగా, తొడలు వైశ్యునిగా, పాదాలు శూద్రునిగా ఉద్భవించారు.
మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు. కాంతి నుండి సూర్యుడు, ముఖము నుండి ఇంద్రాగ్నులు , ప్రాణం నుండి వాయువు ఉత్పన్నమైనారు.
నాభి నుండి అంతరిక్షము ఉద్భవించింది. శిరస్సునుండి స్వర్గము, పాదాల నుండి భూమి, చెవి నుండి దిశలు ఉత్పన్న మైనాయి. అట్లే సమస్త లోకాలు ఉద్భవించాయి.
సమస్త రూపాలను సృష్టించి, పేర్లను కూర్చి ఏ భగవంతుడు క్రియాశీలుడై ఉంటూ, మహిమాన్వితుడూ, సూర్యునిలా ప్రకాశించే వాడూ, అంధకారానికి సుదూరుడు అయిన భగవంతుని నేను తెలుసుకున్నాను.
ఏ భగవంతుని బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపాడో, ఇంద్రుడు నాలుగు దిశలలో అంతా చక్కగా చూసాడో, ఆయనను ఇలా గర్హించిన వాడు ఇక్కడే, అంటే ఈ జన్మలోనే ముక్తుడు అవుతాడు. మోక్షానికి మరో మార్గము లేదు.
దేవతలు ఈ యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించారు. అవి ప్రప్రథమంగా ధర్మాలుగా రూపొందాయి. ప్రారంభంలో ఎక్కడ యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించిన సాధ్యులు, దేవతలు వసిస్తున్నారో, ధర్మాన్ని ఆచరించే మహాత్ములు ఆ ఉన్నత లోకాన్ని ప్రాప్తిన్చుకొంటారు.
(ఇక్కడి వరకే పురుష సూక్తము. కానీ దక్షిణాదిలో పురుష సుక్తాన్ని ఉత్తర నారాయణం, నారాయణ సూక్తం, విష్ణు సూక్తం లోని మొదటి శ్లోకంతో పాటు కలిపి పారాయణం చేస్తారు. ఈ కిందవి అవి).
నీటినుండి, భూసారము నుండి ప్రపంచం ఉద్భవించింది. ప్రపంచాన్ని సృజించిన భగవంతుని నుండి శ్రేష్ఠుడైన బ్రహ్మ ఉద్భవించాడు. భగవంతుడు ఆ బ్రహ్మ రూపాన్ని చక్కదిద్ది దానిలో వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మ యొక్క ఈ ప్రపంచ రూపు సృష్టి యొక్క ఆదిలో ఉద్భవించింది.
మహిమాన్వితుడు, సూర్యునిలా ప్రకాశమానుడు, అంధకారానికి దూరుడు అయిన భగవంతుని నేను ఎరుగుదును. ఆయనను ఇలా తెలుసుకోనేవాడు ఇక్కడ ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. ముక్తికి మరో దారి లేదు.
భగవంతుడు ప్రపంచంలో క్రియాశీలుడై వెలుగు తున్నాడు. జన్మలేని వాడుగా ఉంటూనే ఆయన అనేక రూపాలలో ఉద్భవిస్తున్నాడు. ఆయన నిజ స్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు. బ్రహ్మ వంటి వారు సైతం మరీచి మొదలైన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు.
ఎవరు దేవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో, దేవతల గురువుగా భాసిస్తున్నాడో, దేవతల కంటే పూర్వమే ఉద్భవించాడో, ఆ ప్రకాశమానుడైన భగవంతునికి నమస్కారము.
భగవంతుని గురించిన సత్యాన్ని తెలిపేటప్పుడు దేవతలు ఆదిలో దానిని గురించి ఇలా అన్నారు: "భగవంతుణ్ణి అన్వేషించే వారు ఎవరైనప్పటికీ ఇలా తెలుసుకున్నాడంటే అతడికి దేవతలు వశులై ఉంటారు."
హ్రీ మరియు లక్ష్మీ దేవి నీ అర్ధాంగినులు. రేయింబవళ్ళు నీ పార్శ్వాలు. నక్షత్రాలు నీ దివ్య రూపం. అశ్వినీ దేవతలు నీ వికసిత వదనం.
ఓ భగవంతుడా! మేము కోరుకున్న దానిని ప్రసాదించి కరుణించు. ఈ ప్రపంచ సుఖాన్ని ఇచ్చి మమ్ము కరుణించు. ఇహపారాలలో సమస్తాన్ని ప్రసాదించి కరుణించు.

హనుమంతుడి సందేశం

హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.

హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట – ‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని. కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు. మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.


‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు. ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా!

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకూ అంటే – ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. ‘పెద్దల మాటకు బద్ధులుకండి. మన గౌరవానికేమి హాని ఉండదు'. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశాల్ని అర్థం చేసుకొని, మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం.

దృష్టి సోకడం అనేది నిజంగా ఉందా? (Drushti or Disti)

తలనొప్పి, కడుపునొప్పి, తిన్నది జీర్ణం కాకపోవడం, తలతిరగడం, కడుపులో తెమలడం, వాంతులు, ఉన్నట్టుండి నీరసించిపోవడం, విపరీతంగా ఆవిలింతలు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు దృష్టి సోకింది అనుకోవడం తెలిసిందే. అందునా పసి పిల్లలకు తరచూ దృష్టి సోకినట్లు భావిస్తుంటాం. ఉన్నట్టుండి ఈ రకమైన అనారోగ్య లక్షణాలు కనిపించడం కాకతాళీయమా లేక దిష్టి తగలడమేనా?

దృష్టి సోకినప్పుడు ఉప్పు లేదా మిరపకాయలు ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగదీసి నిప్పులో వేస్తారు. లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తారు. కొందరు పసుపు, సున్నం కలిపిన ఎర్ర నీళ్ళని దిష్టి తగిలిన వ్యక్తికి నివాళించి మూడు దారులు కలిసే ప్రదేశంలో పారబోస్తారు. ఇంకొందరు చెప్పు, లేదా చీపురుతో దిష్టి తీస్తారు.

విరగ్గాసిన చెట్లు, నిండా పండిన చేలు, సమృద్ధిగా పాలు ఇచ్చే పాడి పశువులు, నిర్మాణంలో ఉన్న ఇళ్ళు లేదా భవంతి, కొత్తగా కొన్న వాహనం మొదలైన వాటికి కూడా దిష్టి తగులుతుందనే నమ్మకం ఉంది. వీటిక్కూడా దృష్టి సోకకుండా నివారణోపాయాలు ఉన్నాయి. మంత్రించిన నల్లదారం, మంత్రించిన నిమ్మకాయలు, వాకిట్లో గుమ్మడికాయ కట్టడం, గుమ్మానికి మూడు నిమ్మకాయలు కట్టడం, దిష్టిబొమ్మ వెళ్ళాడదీయడం, రాక్షసబొమ్మను ముఖద్వారానికి ఎదురుగా కట్టడం లాంటివి చేస్తుంటారు.
అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడం లేదా చక్కగా పండిన చేనుకు ఉన్నట్టుండి ఏదో రూపంలో హాని జరగడం, పాడి పశువు పాలు ఇవ్వకపోవడం మొదలైనవి యాదృచ్చికంగా జరుగుతాయా లేక దృష్టి సోకడమే సిసలైన కారణమా? ఇంతకీ నిజంగా దృష్టి సోకుతుందా? ఇందులో శాస్త్రీయత ఉందా లేక ఇది కేవలం మూఢనమ్మకమా?

దిష్టి తగలడాన్ని తేలిగ్గా తీసేయలేమని చెప్పారు పెద్దలు. ఇది ఒట్టి భ్రమ లేదా మూఢ నమ్మకం కాదని పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. శాస్త్రీయంగా దృష్టి ఎలా సోకుతుందో చూద్దాం.

మనందరిలో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకలా ఉండవు. అన్నిసార్లూ ఒకలా ఉండవు. మనలో ప్రవహించే విద్యుత్తు కళ్ళ ద్వారా బయటకు ప్రసరిస్తుంది. కనుక చూపు ప్రభావం తప్పకుండా ఉంటుంది. కొందరి ఆలోచనాసరళి లాగే చూపులు కూడా చల్లగా ఉంటాయి. ఆ చూపు మేలు చేస్తుంది. ఎక్స్-రే కిరణాలు కంటికి కనిపించవు. అలాగే చూపు ద్వారా వెలువడే విద్యుత్ బయటకు కనిపించదు. కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి.
 
మహాశివుడు తన తపస్సును భంగం చేయాలనుకున్న మన్మథుని చూపుతో కాల్చేశాడు కదా! ఇది కేవలం పురాణ కథ కాదు. కంటి చూపుకు అంతటి శక్తి ఉంది.

కనుక వక్ర దృష్టి, ఈర్ష్యాసూయలతో కూడిన తీక్ష్ణ దృష్టి సోకినప్పుడు దృష్టి సోకుతుంది. దానికి విరుగుడు పాటించడం మూఢ నమ్మకం కాదు.

సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః | పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్ ||

కృష్ణుడు నిల్చున్నతీరు గమనిస్తే, ఒక కాలు భూమిమీద, మరొక కాలు భూమిమీద ఆనీఅననట్లు ఉంటుంది. దీని ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే - అన్నింటా ఉంటూ అంటీముట్టనట్లు ఉండమని. తామరాకుపై నీటిబిందువులాగా దేనికీ అంటకుండా సమతుల్యతాభావంతో జీవించమన్నదే కృష్ణబోధ.
కృష్ణుని చేతిలో మురళి వెదురుతో చేయబడింది. లోపలంతా ఖాళీ (శూన్యం). ఇది స్వచ్ఛతను సూచిస్తుంది. అంతరంగములోపల అహం లేకుండా భావాతీతస్థితిలో ఉండమని సూచిస్తుంది. అలానే మురళిలోని ఏడురంద్రాలు మనలోని ఏడు చక్రాలకు సూచన. కృష్ణుడు అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడు. ఏ అహంలేని స్వచ్ఛమైన అంతరంగం మురళి (వేణువు). ఆ వేణువులో తిరిగాడే గాలి ప్రాణవాయువు.
కృష్ణుడు ఎక్కువగా మురళివాయిస్తూ, నాట్యం చేస్తూ, ఆటలాడుతూ జీవితాన్ని అలవోకగా ఆహ్లాదంగా గడుపుతున్నట్లు కన్పించడంలో మానవులు కూడా ఎప్పుడూ పరమానందంలోనే ఉండాలన్న సూచన ఉంది. కృష్ణుడు అంటేనే అపరిమితమైన ఆనందం. అత్యున్నత ఆనందం. ప్రాణాయామం అనే సాధనద్వారా మూలాధారం నుంచి సహస్రారం వరకు శ్వాస (వాయువు) క్రిందకు పైకీ సాగిస్తే తదేకదృష్టి కల్గి మనస్సు ప్రాణంలో, ప్రాణం ఆత్మలో, ఆత్మ పరమాత్మలో లయమైనటువంటి సమాధిస్థితి కల్గుతుంది. ఈ స్థితే సహజయోగ పరమానందకరస్థితి. ఈ స్థితిలో మానవులుండాలన్నదే కృష్ణసందేశం.
కృష్ణుడి వర్ణం నీలం. అంతులేకుండా అంతటా వ్యాపించిన ఆకాశం ప్రకృతిలో భాగం. శూన్యమైన ఆకాశం నీలివర్ణం. కృష్ణుడుని నీలంరంగులో చూపించడానికి కారణం నిరంతరం ప్రకృతిలోనే ఉన్నాడని, అనంతమై ఉన్నాడని అర్ధం. ఎప్పుడూ ప్రకృతిలోనే ఉండాలన్న విషయాన్ని నీలంరంగు సూచిస్తుంది. ప్రకృతిలో ఉండడంవలన భూతదయ, సంయమనం, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
దేవాదిదేవుడు, చతుర్దశ భువన భాండాగారుడు, చరాచర సృష్టికి అధిపతి అయినను నెమలిఫించంనే ధరించడంలో సందేశమేమిటంటే ఏ స్థితియందున్న ఏదీ మోయకూడదని, ఆడంబ అహంకారములు లేకుండా నిర్మలంగా నిరాడంబరంగా జీవించాలని.
గోవు జ్ఞానానికి గుర్తు. గోవు చెంతనే ఉండడం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే తరిస్తారన్న సందేశముంది.
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః |
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్ ||
యుద్ధభూమిలో ఉపనిషత్తులనే గోవులనుండి, అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసుకొని గీత అనే అమృతాన్ని పితికి అందర్నీ ముక్తులను చేసే కృష్ణభగవానుడికి నమస్కరించడం తప్ప ఏమివ్వగలం? అది చాలు అంటాడు బీష్మపితామహుడు -
ఏకోపి కృష్ణస్య కృత ప్రణమో
దశాశ్వమేదావభ్రుదే: నతుల్యః
దశాశ్వమేధీ పునరితి జన్మ
కృష్ణప్రణామీ న పునర్భవాయ||
శ్రీకృష్ణునికి చేసిన ఒక నమస్కారం పది అశ్వమేధాలకు సమానం. పదిసార్లు అశ్వమేధం చేసినవారికైన పునర్జన్మ ఉన్నది. కానీ, కృష్ణునికి ప్రణామం చేసినవానికి మరల జన్మ ఉండదని బీష్ముడు చెప్తాడు.
శత్రుచ్చేదైకమన్త్రం సకలముపనిషద్వాక్యసమ్పూజ్యమన్త్రం
సంసారోచ్చేదమన్త్రం సముచితతమసః సంఘనిర్యాణమన్త్రమ్
సర్వైశ్వర్యైకమన్త్రం వ్యసనభుజగసన్దష్టసన్త్రాణమన్త్రం
జిహ్వే శ్రీకృష్ణమన్త్రం జప జప సతతం జన్మసాఫల్యమన్త్రం||
(ముకుందమాలా)
సర్వ శత్రువులను నశింపజేయునది, ఉపనిషద్వాక్యములచే పూజింపబడునది, సంసారమునుండి విడిపించునది, అజ్ఞానాంధకారమును తొలగించునది, సమస్త ఐశ్వర్యములను చేకూర్చునది, ప్రాపంచిక దుఃఖమనెడి విషసర్పకాటుకు గురియైనవారిని రక్షించునది, ఈ జగత్తులో జన్మసాఫల్యమును చేకూర్చునది కృష్ణ మంత్రమే. కాబట్టి దయచేసి శ్రీకృష్ణ మంత్రమునే సతతం జపించుము

Thursday, 10 September 2015

పండుగలు ఎలా పుట్టాయి?

indian_festival_image-2

           పండుగలు జరుపుకోవడం ప్రపంచమంతా ఉంది. రకరకాల పండుగలు రకరకాల కారణాలు, నేపథ్యాలు చెబుతూ జరపడం మామూలు దృశ్యమే. అసలు పండుగ అనే భావన సమాజంలో ఎలా తలెత్తింది? అది మానవుడ్ని ఎలా ప్రభావితం చేస్తోంది అనే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.కొన్ని వందలు, వేల ఏళ్ళ క్రితం నుంచి సమాజంలో ఉన్న నమ్మకాలు, సంప్రదాయాలు క్రియా రూపాన్ని పొందిన ఫలితమే పండుగ అని ప్రముఖ పరిశోధకులు ఆర్వీయస్‌ సుందరం అంటారు. ప్రారంభంలో ప్రకృతి ఆరాధనగా ప్రారంభమై, వ్యవసాయ సంస్కృతి కాలంలో స్పష్టమైన రూపాన్ని పొంది, ఆ తరువాత మరింత క్లిష్టమైన రూపాన్ని సంతరించుకుని చివరకు ప్రాచీన ఆచారాల సూచికలుగా మనుగడలోకి వచ్చిన పర్వదినాలనే పండుగలుగా జరుపుకుంటున్నారు. అలాగే ప్రత్యేక సందర్భాలను గుర్తు చేసుకుంటూ చేసుకునేవీ పండుగలే. మహాత్ములు పుట్టిన రోజులు, దుష్ట సంహారం జరిగిన రోజులు ఇందుకు మంచి ఉదాహరణలు.నిజానికి పండుగలు ఎలా పుట్టాయి అనే విషయాన్ని ఇదమిత్థంగా చెప్పడం చాలా కష్టమైన పనే. నూటికి తొంభరు శాతం పండుగలు ప్రాచీన కాలపు కర్మకాండలను తెలియజేసేవే నని పండితుల అభిప్రాయం. మొదట మానవాతీత శక్తుల మీద విపరీతమైన నమ్మకం ఉన్న ఆదిమానవుడు తరువాత్తరువాత ఉత్సవ ప్రియుడై, తన ఆనంద విషాదాలను, ఇష్టాఇష్టాలను దేవునికి అంటగట్టి, దేవుని సంతృప్తి పరిచే వంకతో తనకు ఇష్టమైన వాటినన్నింటినీ చేయనారంభించాడు. ఈ విధంగా వచ్చినవే ఉత్సవ సంప్రదాయాలని కొందరంటున్నారు. సమస్యల వలయంలో చిక్కుకుని ఉండే మనిషి పండుగ నెపంతో తాత్కాలికంగా నైనా ఆటవిడుపు పొందడానికి, దేవునికి తన గోడు వినిపించి సాంత్వన పొందడానికి పండుగలు మంచి వేదికలయ్యాయి. వీలుంటే ఈ లోకంలో లేకుంటే పరలోకంలో నైనా తమకు కష్టాలు లేకుండా చెయ్యడానికి దేవునికి అనేక కర్మకాండలతో కూడిన పూజలు చేసి తృప్తిపొందడం మానవ నైజంగా మారింది. అందుకనే ఎంత యాంత్రికమైన జీవనాన్ని గడుపుతున్న వ్యక్తయినా పండుగ రోజున మాత్రం దేవునికి కేటాయించి మానసిక తృప్తిని పొందే ప్రయత్నం చేస్తాడు.
*దళితులను దూరం చేసిన మనువాదులు
ఎవరికి ఇష్టమొచ్చిన దేవున్ని వారు, ఏ పండుగను జరుపుకోవాలంటే ఆ పండుగను జరుపుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి సహజంగా ఉంటుంది.అయితే భారత దేశంలో ఈ పరిస్థితి లేదు. ఆదిమ యుగం నుంచి ఇనుప యుగం (అయో యుగం)లోకి ప్రవేశించిన అనంతరం మనుషుల మధ్య అంతరాలను ఏర్పరుస్తూ కుల వ్యవస్థ ప్రారంభమయింది. హిందువులు ఎంతో పవిత్రంగా భాంచే వేద పారాయణాన్ని పంచములకు నిషిద్ధమన్నారు. దేవాలయాల్లోకి వారు రాకూడదన్నారు. ఆ విధంగా భారతీయ సమాజంలో ఉత్పత్తి కులాల్లో ముఖ్యమైన వాటిని దేవునికీ, దేవుని పేర జరుపుకునే పండుగలకు దూరం చేశారు. రాకెట్‌ యుగంలోకి భారత దేశం దూసుకుపోతున్నా ఇంకా దేవాలయ ప్రవేశానికి నోచుకోని దళిత గ్రామాలెన్నో ఇక్కడ ఉన్నాయి. అదే సమయంలో సైన్స్‌ ఇంతగా అభివృద్ధి చెందినా ఇంకా పండుగలు పబ్బాల పట్ల అశాస్త్రీయ అవగాహనను కొనసాగిస్తూ ఎంతో సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చెయ్యడమే కాదు, ఎన్నో అకృత్యాలకూ అవకాశం కల్పించడం వర్తమానంలో కొనసాగుతున్న విషాదం!

బ్యాంకాక్ బ్రహ్మ దేవాలయ విశేషాలు

bankak-1


థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని పాథుమ్‌ వాన్‌ జిల్లాలో ఈ ఎరవాన్‌ బ్రహ్మ దేవాలయం ఉంది. సుప్రసిద్ధ రాచప్రాసాంగ్‌ కూడలిలోని ఈ ఆలయాన్ని స్థానిక బౌద్ధులు, చైనీయులు, తూర్పు ఆసియా పర్యాటకులు తరుచుగా దర్శిస్తుంటారు. విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. బ్యాంకాక్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఎరవాన్‌ శ్రైన్‌ ఆలయం కూడా ఒకటి. శ్రైన్‌ అంటే పుణ్య క్షేత్రమని అర్థం. ఆలయంలోని ప్రధాన విగ్రహాన్ని ‘ఫ్రా ఫోమ్‌’గా స్థానికులు పిలుస్తారు. నిత్యం ప్రార్థనలు జరుగుతుంటాయి. ఆలయ ప్రాంగణంలో తరుచుగా థాయ్‌ నృత్యకారులు ప్రదర్శనలిస్తుంటారు. ఆలయానికి సమీపంలో ఫ్రా లక్ష్మి(లక్ష్మి), ఫ్రా త్రి మూర్తి(త్రి మూర్తి), ఫ్రా ఖానెట్‌(విఘ్నేశ్వరుడు), ఫ్రా ఇన్‌ (ఇంద్రుడు), ఫ్రా నరై సాంగ్‌ సుబాన్‌ (నారాయణుడు) విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. **బ్యాంకాక్‌ వీధుల్లో…. బ్రహ్మ దేవాలయ నిర్మాణం
ఈ ఆలయం నిర్మించడానికి అనేక కారణాలున్నాయి. నగర ఆధునీకరణతో బ్యాంకాక్‌ 1950 సంవత్సరంలో కొత్త రూపును సంతరించుకుంది. విదేశీయుల రాకపోకలు పెరిగాయి. దీంతో రాచప్రాసాంగ్‌ కూడలిలో ఓ హోటల్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ హోటల్‌ నిర్మాణం ప్రారంభించిన నాటి నుంచి అనేక అడ్డంకులు. కూలీలు గాయపడటం, ఆ కూడలిలో అనేక మంది రోడ్డు ప్రమాదంలో మరణించడం. ఇంకా అనేక విఘ్నాలు కలిగాయి. దాంతో ఆ హోటల్‌ యజమాని ఒక మతాధికారిని కలిశాడు. ఆయన సలహా ప్రకారం ‘బ్రహ్మ విగ్రహాన్ని’ హోటల్‌ ముందు ప్రాంగణంలో 1956 సంవత్సరం నవంబర్‌ 9న ప్రతిష్టించారు. హోటల్‌కు ‘ఎరవాన్‌’(ఇంద్రుని ఏనుగు పేరు) అనే పేరు పెట్టమని మతాధికారి సూచించారు. విగ్రహ ప్రతిష్ట జరిగాక ఎటువంటి ఆటంకాలు లేకుండా హోటల్‌ నిర్మాణం పూర్తయింది. బ్రహ్మ విగ్రహం ప్రతిష్టించిన తర్వాత అక్కడి ప్రజలు పూజించడం మొదలుపెట్టారు. అందరిలోనూ బలమైన నమ్మకం ఏర్పడింది. దీంతో రాచప్రాసాంగ్‌ కూడలిలో అనేక దుకాణ సముదాయలు నిర్మించారు. అందరికి ఆ దేవునిపై నమ్మకం, భక్తి పెరిగాయి.
**కొలిచే వారికి కొంగు బంగారం…

థాయ్‌ ప్రజలు బ్రహ్మ దేవుణ్ని భక్తితో పూజించడంతో పాటు, కోరికలు కోరుకునేవారు. పెళ్లైన వారు.. పిల్లల్ని ప్రసాదించమని, పిల్లలు..పరీక్షల్లో పాస్‌ చేయించమని, ప్రేమికులు.. త్వరలో పెళ్లి జరగాలని, ప్రార్థించే వారు. వారి నమ్మకం ఫలించేది. ‘40 సంవత్సరాల క్రితం బ్రహ్మ దేవుణ్ని ఒక కోరిక కోరాను. అది నెరవేరింది’ అని హాంకాంగ్‌ నటి దేబోరహ్‌ లీ ఒక ఇంటర్వ్యూలో సమాధానం చెప్పడంతో ఆమె అభిమానులు అనేక మంది దేవుణ్ని దర్శించడానికి ఆలయానికి క్యూ కట్టారు.
**బ్రహ్మ విగ్రహం ధ్వంసం..

2006 సంవత్సరం మార్చి 21న ఒక ఉన్మత్తుడు బ్రహ్మ విగ్రహాన్ని సుత్తితో పగలకొట్టాడు. కొన్ని రోజులు ఆలయానికి భక్తులెవరని అనుమతింలేదు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బ్రహ్మ దేవుడి ఫొటో పెట్టి పూజలు చేశారు. పాత విగ్రహ శకలాలకు, బంగారం, ఇత్తడి, వెండి, ఇతర విలువైన లోహాలు కలిపి ప్రస్తుత విగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని 2006, మే 21న, సూర్యుని కిరణాలు విగ్రహం మీద నేరుగా పడే సమయం( 11.39 ఏ.ఎమ్‌)లో ప్రతిష్టించారు.

కాలికి మెట్టెలు ఎందుకు?


1898941_2009_214



                       కాలికి మెట్టెలు ధరించడం అనేది పెళ్లి అయిన గుర్తుగా మాత్రమే కాదు. దానివెనుక శాస్త్రీయత దాగి ఉన్నది. సాధారణంగా కాలి రెండవ వేలికి మెట్టెలు ధరించడం జరుగుతుంది. కాళీ రెండవ వేలి నుండి ఒక ప్రత్యేక నరం గర్భాశయునకు సంది చేయబడి గుండె వరకు వెళ్తుంది. ఈ వేలికి మెట్టె పెట్టుకోవడం వల్ల గర్భాశయం ధృడపడుతుంది. ఇది రక్త ప్రసరణను నియంత్రించి ఋతు చక్రం సక్రమంగా వచ్చి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేస్తుంది. వెండి నుంచి ఉష్ణవాహకం కావడం వల్ల భూమి నుంచి ద్రుహవేశములను గ్రహించి శరీరమునకు ప్రసరింపజేస్తుంది. అందుకే వెండితో చేసిన మెట్టెలు ధరించడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.